వర్షాల నేపథ్యలో జిల్లాలో హోంమంత్రి సమీక్ష

VSP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో జిల్లాలో మంగళవారం ఉదయం హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా అన్ని జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు.