దేవరకొండ ఛైర్ పర్సన్‌గా శైలజ
NLG: దేవరకొండ వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆర్డీవో రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. 20వ వార్డులో గెలుపొందిన పున్న శైలజ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. 15వ వార్డులో గెలుపొందిన వార్డు కౌన్సిలర్ జూవేరియా తబుసుమ్‌ను వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.