నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

RR: మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని శంషాబాద్ ఏడీఈ రమేష్ తెలిపారు. కవేలిగూడ, రామంజాపూర్, బోటిగూడ గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.