నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
గుంటూరు నగరంలోని ఎస్‌వీఎన్ కాలనీ రోడ్డు విస్తరణలో భాగంగా శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ ఈఈ, డీఈఈలు పీ. హుస్సేనాఖాన్, ఎన్. గురవయ్యలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఎస్‌వీఎన్ కాలనీ, తారకరా మనగర్, గుజ్జనగుండ్లలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.