అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

కృష్ణా: జిల్లాలో అవుట్-రీచ్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి ముమ్మరంగా తిరిగి యూరియా లభ్యత పైన రైతులందరికీ అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ డీ.కే.బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం యూరియా సరఫరా, లభ్యతపై రెవెన్యూ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు.