నీలకంటేశ్వరాలయంలో ఘనంగా ఆవాహిత దేవతారాధన రుద్ర హోమం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు మంగళవారము ఆవాహిత దేవతారాధన రుద్ర హోమం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణాహుతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఆలయంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.