చీరాల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

BPT: చీరాల ఎమ్మెల్యే కొండయ్య క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 16 మందికి రూ.25,83,320 చెక్కులను ఆయన అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి వరం లాంటిదని అన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించే లక్ష్యంతో పనిచేస్తుందని పేర్కొన్నారు.