విజయవాడలో అధికారుల అప్రమత్తం

విజయవాడలో అధికారుల అప్రమత్తం

NTR: విజయవాడలో అధికారులు అప్రమత్తమయ్యారు. సింగ్‌నగర్‌ డాబా కోట్ల సెంటర్‌లో ముందస్తు చర్యల భాగంగా పడవలను తరలించారు. ప్రస్తుతం బుడమేరు వాగు వరద ప్రవాహం సాధారణంగానే ఉన్నప్పటికీ, ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏవైనా అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.