VIDEO: కోదండ రామాలయానికి పోటెత్తిన భక్తులు
CRT: పుంగనూరు పట్టణంలోని హై స్కూల్ వీధిలో గల శ్రీ కోదండ రామాలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో సీతారాముల లక్ష్మణ సమేత హనుమంతుల వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ తర్వాత భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలు మూడు రోజులపాటు జరుగుతాయని అర్చకులు తెలిపారు.