సీమ పరిస్థితిని మార్చేందుకు చర్యలు: DY.CM పవన్

ATP: శివతాండవం చేసిన నేలగా అనంతపురం జిల్లాను DY.CM పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. 'సూపర్ సిక్స్- సూపర్ హిట్' సభలో ఆయన ప్రసంగించారు. ఎందరో కవులు, కళాకారులను పుట్టించిన సాహిత్య, సాంస్కృతిక కేంద్రమని చెప్పుకొచ్చారు. సీమ ప్రాంతం ఎప్పుడూ కరువు, ఎండకాలతో బాధపడుతుందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. రాయలసీమ పరిస్థితిని మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.