ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
GDWL: అలంపూర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులో తిరుగుతూ పలువురు రోగులు, సహాయకులతో మాట్లాడారు. ఫార్మసీ, ఎక్స్‌రే, డయాలసిస్ యూనిట్, తదితర విభాగాలను పరిశీలించారు. హాజరు రిజిస్టర్‌తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో అనవసరమైన ఫర్నిచర్ తొలగించాలని తెలిపారు.