తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగింత

తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగింత

WGL: కొమ్మాల జాతరలో తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి రియాన్స్‌ను పోలీసులు గుర్తించి సురక్షితంగా తల్లి నన్నబోయిన శిరీషకు అప్పగించారు. హసన్‌పర్తి మండలం పెగడపల్లి గామానికి చెందిన శిరీష తన కుమారెతో కలిసి జాతరకు వచ్చింది. చిన్నారి కనిపించకపోవడంతో తల్లి ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే గాలింపు చేపట్టి, కొద్దిసేపటికే చిన్నారిని గుర్తించి అప్పగించారు.