అక్రమ గ్యాస్ వాడకంపై విజిలెన్స్ దాడులు

అక్రమ గ్యాస్ వాడకంపై విజిలెన్స్ దాడులు

PLD: చిలకలూరిపేటలో గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్యానికి వాడుతున్న వారిపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక సాయి బాలాజీ క్యాటరింగ్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా వాడుతున్న మూడు సిలిండర్లను సీజ్ చేశారు. యజమానిపై 6-ఏ కింద కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.