VIDEO: హనుమాన్ ఆలయంలో నకిలీ నోట్లు..!
RR: కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో నకిలీ నోట్లు కలకలం రేపాయి. భక్తులు సమర్పించిన కానుకల్లో అసలు నోట్ల మధ్య నకిలీ నోట్లు దర్శనమిచ్చాయి. దీంతో పవిత్రమైన దేవాలయాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు.