మొక్కజొన్నకు జై కొడుతున్న రైతన్నలు
E.G: రాజానగరం మండలంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొక్కజొన్న సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. సుమారు 6 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోందని ఏవో రమణ తెలిపారు. నల్లరేగడి, ఎర్రమట్టి నేలలు అనుకూలం కావడంతో, ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం లభిస్తోందని రైతులు పేర్కొంటున్నారు. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా అధిక దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు.