దివ్యాంగురాలిపై అత్యాచారం.. కేసు నమోదు
E.G: కోటనందూరు మండలంలోని దివ్యాంగ గిరిజన యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. యువతిని గుర్తించిన స్థానికులు తునిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నట్లు ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపారు.