సింహాచలం ఈవోగా జె. వెంకటరావు బాధ్యతలు

సింహాచలం ఈవోగా జె. వెంకటరావు బాధ్యతలు

VSP: సింహాచలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా రెవెన్యూ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జె. వెంకటరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు ఈవోగా పనిచేసిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్. సుజాత ఆయనకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. అందరి సమన్వయంతో దేవస్థానాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని వెంకటరావు తెలిపారు.