బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం: కంభం మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో ఉపదేశి రాముల వారి కళ్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు.