ఆర్జీదారులకు మేలు జరగాలి : కలెక్టర్

PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులకు హితవు పలికారు. సమస్యల పరిష్కారంతో అర్జీదారులకు మేలు జరగాలని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు.