త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి: మల్లురవి

HYD: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఫిర్యాదు రాలేదని, అందుకే ఆయనపై చర్చ జరగలేదని తెలంగాణ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయని, నాయకులు సమయమనం పాటించాలని తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే కమిటీకి ఫిర్యాదు చేయాలని పార్టీలోని నేతలకు సూచించారు.