విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

RR: హైదరాబాద్‌కు రహస్యంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన ఓ వ్యాపారి దుబాయ్ నుంచి HYD వస్తూ.. అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలకు చెందిన రూ. 9.62 లక్షల విలువైన కరెన్సీని తన బ్యాగ్‌లో తెచ్చాడు. విమానం దిగి బయటకు వస్తున్న క్రమంలో అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు.