దారులన్నీ మేడారం వైపే!
MHBD: వనదేవతల మహాజాతర నేపథ్యంలో మేడారం వైపు భక్తుల రాక పెరిగింది. బుధవారం నుంచి శ్రీ సమ్మక్క–సారలమ్మల జాతర ఉత్సవాలు ‘మండ మెలగు’ వేడుకతో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో రహదారులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. జాతర వైభవాన్ని వీక్షించేందుకు భక్తుల ఉత్సాహంతో అటవీ ప్రాంతం జనసంద్రంగా మారింది.