'నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం నిర్మించాలి'

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం నిర్మించాలని బహుజన విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. దాదాపు 30 సంవత్సరాలు గడిచిన భవనం శిథిలావస్థకు చేరుకుందని, కొన్ని తరగతులకు పైకప్పు సిమెంట్ రేకులతో నిర్మించారని, వర్షం పడితే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.