'ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత నాదే'

NLG: చందంపేట మండలం గుంటిపల్లి గేట్ వద్ద ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలునాయక్ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత నాదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.