VIDEO: పెద్ద పులి సంచారం.. జాగ్రత్త
KMR: జుక్కల్ మండలం బస్వాపూర్ శివారులోని ఖైరట్ పరిసరాల్లో తలారి ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పులి పాదముద్రలు గుర్తించినట్లు చెప్పారు. గ్రామ ప్రజలు ఆ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. పశువుల కాపరులు, వ్యవసాయ భూమి యజమానులు జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాములు హెచ్చరించారు.