పంట నష్టాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారి
MNCL: పంట నష్ట నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని దండేపల్లి మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ అన్నారు. అకాల వర్షంతో దండేపల్లి మండలంలోని కొరివిచెల్మ గ్రామ శివారులో పాడైన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షంతో మొక్కజొన్న, తదితర పంటలకు నష్టం వాటిలిందన్నారు.