'అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి'

MHBD: గ్రామాల్లో నేలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై PDSU నాయకులు గురువారం గార్ల మండల MPDO మంగమ్మకు వినతి పత్రం సమర్పించారు. వర్షాల కారణంగా గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఆస్తవ్యస్తంగా తయారైందని, దీనివల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి తగ్గిన చర్యలు తీసుకోవాలని కోరారు.