వైభవంగా పౌర్ణమి విశేషం పూజలు

వైభవంగా పౌర్ణమి విశేషం పూజలు

CTR: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో బుధవారం పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించి, అనంతరం భక్తుల నడుమ అభిషేకం నిర్వహించారు. అనంతరం లోక కల్యాణార్ధం ఆలయం ప్రధాన అర్చకులచే శ్రీ లక్ష్మీ నారాయణ మహా హోమం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.