VIDEO: కొల్లిపరలో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి తిరుణాళ్లు
GNTR: కృష్ణా నది తీరంలోని కొల్లిపరలో బుధవారం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి తిరుణాళ్లు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, పూలు, గాజులతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేపట్టడంతో కార్యక్రమం భక్తిపూర్వకంగా ముగిసింది.