బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

చిత్తూరు: చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం గూడూరు ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్‌ను బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు.