VIDEO: నిమ్మనపల్లెలో 'స్వర్ణ ఆంధ్ర విజన్' కార్యక్రమం
అన్నమయ్య: నిమ్మనపల్లెలో పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. 'స్వర్ణ ఆంధ్ర విజన్ – పేదరిక నిర్మూలన' (P4) కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆవరణంలో ఈ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా మార్గదర్శి డా.రఘుపాథుల నేతృత్వంలో బంగారు కుటుంబాలకు ఉచిత వైద్య సేవలందించారు. భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.