పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
GNTR: నల్లపాడు రోడ్డులోని ఆదర్శనగర్ రూ.1.40 లక్షల వ్యయంతో చేపడుతున్న కాల్వలు, రహదారి నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే గళ్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామని, కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.