'బీసీ గర్జన మహాసభను విజయవంతం చేయాలి'

'బీసీ గర్జన మహాసభను విజయవంతం చేయాలి'

HNK: కాజీపేట మండల కేంద్రంలోని మీడియా పాయింట్‌లో నేడు బీసీ గర్జన మహాసభ వాల్ పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న జరుగు బీసీ గర్జన మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.