అడవిలో వ్యక్తిపై పులి దాడి

అడవిలో వ్యక్తిపై పులి దాడి

KMR: రామారెడ్డి రెడ్డిపేట స్కూల్ తండాకు చెందిన  సలావత్ మత్తు (45)పై ఇవాళ పులి దాడి చేసింది. భార్యతో కలిసి కట్టెల కోసం అడవికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పులి దాడిలో మత్తు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు అరవడంతో పులి అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన వ్యక్తిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.