ఇంటి ముందు నిలిపిన బైక్ తగులబెట్టారు

ఇంటి ముందు నిలిపిన బైక్ తగులబెట్టారు

NZB: సాలూరలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంగెపు సాయిబాబు గురువారం రాత్రి తన బైక్‌ను ఇంటి ముందు నిలిపి ఉంచాడు. అర్ధరాత్రి దుండగులు వాహనానికి నిప్పు పెట్టడంతో అది పూర్తిగా దగ్ధమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు బోధన్ రూరల్ SI మచ్చెందర్ రెడ్డి కేసు నమోదు చేశారు.