ఈనెల 3న దేవరకొండలో పట్టుబడిన వాహనాలకు వేలం
NLG: దేవరకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలకు ఈనెల 3న వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. టూ వీలర్స్‌కు రూ.10 వేలు, ఫోర్ వీలర్స్‌కు రూ.30 వేలు అదే రోజు ఉదయం 10 గంటల లోపు దేవరకొండ స్టేషన్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. వాహనాలు కొనుగోలు చేయని పక్షంలో డిపాజిట్ వాపస్ ఇవ్వనున్నారు.