‘యుద్ధాన్ని ఆపలేరు.. కొనసాగించలేరు’
ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం ట్రంప్ స్వయంకృతాపరాధమని CIA మాజీ చీఫ్ పనెట్టా దుయ్యబట్టారు. యుద్ధాన్ని అర్ధంతరంగా ఆపితే వైఫల్యమని, కొనసాగిస్తే సంక్షోభం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. మిత్రదేశాలతో చర్చించకుండా యుద్ధానికి దిగడం వల్ల US భారీ మూల్యం చెల్లించుకుంటోందన్నారు. ఈ యుద్ధ ప్రభావం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని హెచ్చరించారు.