అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి: పరిటాల శ్రీరామ్

సత్యసాయి: ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ సచివాలయ సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని, చిన్న చిన్న కారణాలతో అర్హులు పథకాలకు దూరం కాకూడదన్నారు. ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, చేనేతలకు ఉచిత విద్యుత్ వంటి దరఖాస్తులు ఎలాంటి తప్పులు లేకుండా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.