'ప్రజల సమస్యలు పారదర్శకంగా పరిష్కరించాలి'
PPM: ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులుకు ఎస్పీ ఎస్వీ.మాధవ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 9 ఫిర్యాదులు స్వీకరించారని తెలిపారు.