ట్రాక్టర్ బోల్తా.. మృతుడు ఇతడే..!
BDK: అశ్వాపురం మండలంలోని గొందిగూడెం ఎల్ అండ్ టి క్రషర్ మిల్లు వద్ద ఎర్రగోతుల కుంటలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన డ్రైవర్ జిత్తు(19)గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.