తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య

తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య

జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఎద్దు అరవింద్ (19) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన అరవింద్ తన వ్యవసాయ బావి వద్ద మామిడి చెట్టుకు పశువులను కట్టే తాడుతో ఉరి వేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.