VIDEO: లారీ సంఘాల ఆధిపత్య పోరుతో రైతులకు ఇబ్బందులు

VIDEO: లారీ సంఘాల ఆధిపత్య పోరుతో రైతులకు ఇబ్బందులు

WGL: ఎనుమాముల మార్కెట్లో లారీ సంఘాల, మధ్య ఆధిపత్య పోరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ లోపల వందలకొద్ది లారీలు రహదారికి ఇరువైపులా నిలపడంతో ఉత్పత్తుల క్రయవిక్రయాలకు ఆటంకం కలుగుతుందని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై ఇటీవల అధికారులు- లారీ సంఘాల, సభ్యుల మధ్య చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఇదే పునరావృతం అవుతుందని రైతులు, వ్యాపారులు ఆగ్రహిస్తున్నారు.