మాజీ ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలోకి చేరికలు
VZM: బొండపల్లి మండలం గొట్లం గ్రామానికి చెందిన పది కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. సోమవారం గజపతినగరం వైసీపీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.