గోదావరి వింత.. అన్ సీజన్‌లో చిక్కిన 'పులస'
కోనసీమ జిల్లా పి. గన్నవరం ప్రాంతంలో గోదావరి నదిలో అన్‌సీజన్‌లో పులస చేప జాలరకు చిక్కడం విశేషంగా మారింది. సాధారణంగా వరద కాలంలో మాత్రమే కనిపించే ఈ పులస.. ఏప్రిల్ నెలలో దొరకడం చాలా అరుదైన విషయం కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. గురువారం మార్కెట్‌కు తీసుకురాగానే పులస ప్రియులు పెద్ద ఎత్తున వేలంలో పాల్గొనగా.. రూ.4,000 ధర పలికింది.