గుడిపల్లిపాడులో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు

NLR: రూరల్ మండలంలోని గుడిపల్లిపాడులో నూతనంగా నిర్మించిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈనెల 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. 14వ తేదీన మహా సంకల్పం, పుణ్యహవాచనంతో మొదలు 15, 16, 17వ తేదీల్లో విశేష పూజలు, హోమాలు, గ్రామోత్సవం ఉంటుందని పేర్కొన్నారు.