జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కొత్త ఏవోగా సుమంత్
NZB: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిపాలన అధికారిగా గ్రూప్-1 కేటగిరీకి చెందిన సుమంత్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన జిల్లా వైద్యాధికారి రాజశ్రీ ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి, సిబ్బంది ఆయనకు శాలువా, పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.