అంబాడ పాఠశాలలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ

శ్రీకాకుళం: రేగిడి ఆమదాలవలస మండలం అంబాడ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈ.ఓ ప్రసాదరావు, నీలకంటేశ్వర యాదవ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.