వల్లభ రావు పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

MBNR: వల్లభ రావు పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల స్లాబ్ లెవెల్ పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి సుదర్శన్ పరిశీలించి ఫోటోలు క్యాప్చర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారమే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పనుల్లో నాణ్యతతోపాటు సూచించిన ప్రమాణాలు పాటించాలని అన్నారు.