VIDEO: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

NLR: కోవూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక వైపు ఆటో ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒక మహిళ మృతి చెందగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ కొడవలూరు మండలం ఎల్లయ్యపాలెం గ్రామానికి చెందిన ఆయేషా (40) గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.