వీల్ చైర్ పై పోలింగ్ కేంద్రానికి వచ్చిన 90 ఏళ్ల వృద్ధురాలు
WGL: రాయపర్తి మండలం రాగన్నగూడెంలో 90 ఏళ్ల వృద్ధురాలు భద్రమ్మ వీల్ చైర్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రత్యేక ఏర్పాట్లతో తీసుకొస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న భద్రమ్మ చర్యకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.